“బంగారు తెలంగాణలో బంగారు కానుక బతుకమ్మ చీరలు” : గ్రామ సర్పంచ్ పి భీమప్ప

యాలాల సెప్టెంబర్ 24 ( జనం సాక్షి ): యాలాల మండలం అగ్గనూరు గ్రామంలో జరిగిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి. భీమప్ప మాట్లాడుతూ దసరా పండుగ ముందు బంగారు తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మహిళలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేపట్టడం జరిగినది. గ్రామ అభివృద్ధి మరియు పరిశుభ్ర కార్యక్రమాలలో అందరు నాకు సహకరించడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు మరియు గ్రామ ప్రజల భాగస్వామ్యముతో గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించడానికి నా శాయ శక్తుల పని చేస్తానని ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ బి.గరిగప్ప, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, గ్రామ వార్డు సభ్యులు, విద్యా కమిటీ చైర్మన్లు యు. వెంకటయ్య, శ్రీశైలం, గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు మరియు గ్రామంలోని పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.