బంగారు తెలంగాణే లక్ష్యం

4B
4

 

4A

 

 

-ఆ దిశగా సర్కారు అడుగులు

-పేదల సంక్షేమం కోసమే పథకాలు

-గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): బంగారు తెలంగాణే సర్కారు లక్ష్యం మని ఆదిశగా ప్రభుత్వం ముందుకు అడుగులు వెస్తుందని, వాటర్‌గ్రిడ్‌ పథకం ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని, ఇది బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందడానికి అందరి సహకారం అవసరమని చెప్పారు. వెనకబాటుతనానికి, పేదరికానికి రాజకీయాలే కారణమని, అవినీతికి ఆస్కారం లేని పాలనను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని పేదల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ అవినీతే అన్ని రుగ్మతలకు కారణమని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తామని, వాటర్‌ గ్రిడ్‌ పథకంతో ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా చేస్తామన్నారు. 1.26 లక్షల కి.విూటర్ల మేర వాటర్‌ పైపులైన్‌ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.  తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానించేందుకు కొత్త పారిశ్రామిక  పాలసీని తీసుకొచ్చిందని,. కొత్త రాష్టాన్రికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు.  మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరుగుతోంది. తెలంగాణ సాంస్కృతిక సారధి ద్వారా కళలకు ప్రోత్సాహం కల్పిస్తుంది. వరంగల్‌ జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఎంప్లాయి ఫ్రెండ్లీగా వ్యవహరిస్తుంది. విద్యుత్‌ కొనుగోలు కోసం ప్రభుత్వం పక్క రాష్టాల్రతో ఒప్పందం చేసుకుంది. నల్లగొండ ప్రజలకు సాగు, తాగు నీరు అందించేందుకు నక్కలగండి ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులిచ్చింది. హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నది. రైతు రుణమాఫీని విజయవంతంగా అమలు చేసింది. సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారు చేస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో తొలి గణతంత్ర వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. రాజకీయ అవినీతిని అంతమొందిస్తామని, అవినీతి రహిత పాలన అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు చెప్పారు. వాటర్‌ గ్రిడ్‌ పథకంతో ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా చేస్తామన్నారు. 1.26 లక్షల కి.విూటర్ల మేర వాటర్‌ పైపులైన్‌ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా వ్యవసాయం, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు.  రాజకీయ అవినీతిని పూర్తిగా అరికడుతామని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. రాజకీయ అవినీతిని అంతమొందిస్తామని, అవినీతి రహిత పాలన అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు చెప్పారు.  వృద్ధులు, వితంతువులకు రూ.1000 పెన్షన్‌ ను ప్రభుత్వమిస్తోందని, కేజీ టు పీజీ విద్యను అమలు చేస్తామన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా వ్యవసాయం, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యం పథకం..తెలంగాణ సాంస్కృతిక సారధి ద్వారా కళలకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. విద్యుత్‌ కొనుగోలు కోసం పక్క రాష్టాల్రతో ఒప్పందం, నల్గొండ ప్రజలకు సాగు, తాగునీరందించేందుకు నక్కలగండి ప్రాజెక్టు పరిపాలన అనుమతులున్నాయని గవర్నర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎక్స్పెస్ర్‌ హైవేలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉండే పాలనను అందిస్తామని, విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నామని, రానున్న మూడేళ్లలో విద్యుత్‌ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగానే వాటర్‌ గ్రిడ్‌, మిషన్‌ కాకతీయ కార్యక్రమాలు చేపట్టామని, పేదలకు డబుల్‌ బెడ్రూం పథకాన్ని పారదర్శకంగా అమలుచేస్తామని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. బంగారు తెలంగాణ పునర్‌ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ గవర్నర్‌ తన ప్రసంగాన్ని ముగించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్‌, సీఎస్‌ రాజీవ్‌ శర్మ, పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్‌ పాల్గొన్నారు. సమయభావం వల్ల శకటాల ప్రదర్శనను రద్దు చేశారు.