బంగారు తెలంగాణ ఏర్పాటు కెసిఆర్‌కే సాధ్యం
మరోమారు గెలిపించి అభివృద్దికి పాటుపడాలి
మహబూబాబాద్ టిఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్
మహబుబాబాద్,నవంబర్26(జనంసాక్షి): తెలంగాణ ప్రజల మనసులో కారు, కేసీఆర్ తప్ప, ఎవరూ లేరని మహబూబాబాద్ టిఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ అన్నారు. కెసిఆర్ చేస్తున్న అభివృద్దితో మల్లీ తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. దేశంలోనే సంక్షేమ రారాజుగా తెలంగాణ రాష్ట్రం ముందున్నని అన్నారు. నాలుగున్నరేళ్లుగా కంటివిూద కులుకులేకుండా పనిచేస్తే నిందలు వేస్తారా..? అని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే రాష్ట్రానికి రాబడి పెంచాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇసుక రవాణా ద్వారా ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేదనీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వేల కోట్లు ఆదాయాన్ని పెంచి ప్రజలకు సంక్షేమం ద్వారా అందిస్తోందని అన్నారు. సంపదను పెంచడంలోగానీ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయడంలోగానీ కేసీఆర్‌కు ఎవరూ సాటి రారన్నారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబును తెలంగాణకు తెస్తున్నారని అలాంటి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రానివ్వకుండా ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విూద మళ్లీ ఆంధ్రా సీఏం చంద్రబాబునాయుడు పెత్తనం అవసరమా అని ప్రజలు ఆలోచించాలన్నారు. చంద్రబాబును బుజాల విూదకు ఎత్తుకుని తీసుకొస్తున్న కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. అలాటి వారిని చిత్తుగా ఓడించి రాజకీయంగా తరిమికొట్టాలని పిలుపుచ్చారు. మంచినీళ్ల నుంచి మద్యం వరకు సిండికేటు రాజకీయాలు చేసే నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీది, వారి హయాంలోనే నియోజకవర్గ ప్రజలకు తాగునీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. 60 ఏండ్లలో జరగని అభివృద్దిని నాలుగేండ్లలో సీఏం కేసీఆర్ చేసి చూపించాడమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ప్రజలు కరంట్ కష్టాలు అనుభవించారని, కానీ తెలంగాణ ప్రభుత్వం 24గంటల కరంట్ ఇస్తూ వారి కష్టాలను కడతేర్చిందని అన్నారు. దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్‌కు జనం నీరాజనం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కూటమిని కూలదోసి బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలన్నారు.