బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణ గా మారుస్తున్న కెసిఆర్.

ప్రాజెక్టుల పేరుతో రీ డిజైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు వృదా.
రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలి.
టిజెఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు,నాగర్ ర్నూల్ ఇంచార్జి మొసలి శ్యాంప్రసాద్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి నాళ్ళలో మిగులు బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ పలుమార్లు చెప్పారని కానీ ప్రస్తుతం కేంద్ర మంత్రి ప్రకటించిన ప్రకారం కెసిఆర్ ప్రభుత్వం నాలుగు లక్షల 47 వేల కోట్ల చేశారని ఇందులో బడ్జెట్ అప్పు3 లక్షల 12 వేల 191కోట్ల అని గ్యారెంటీ అప్పులు ఒక లక్షా 35 వేల 282 కోట్ల అప్పు చేశారని బంగారు తెలంగాణ పేరుతో అప్పుగా తెలంగాణ గా కెసిఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు నాగర్ ర్నూల్ ఇంచార్జీ మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో 69 వేల కోట్లు మాత్రమే ఉన్న తెలంగాణ అప్పు నేడు ఏకంగా నాలుగున్నర లక్షల కోట్లకు చేరిందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం లోక్ సభలో రాష్ట్రాల అప్పు గురించి ఒక ప్రకటన చేయడం తో తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులు బయటపడ్డాయని,బంగారు తెలంగాణ ముసుగులో ప్రజలను మభ్యపెడుతూ ఇంత అప్పు చేసినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని,దళితులకు 3 ఎకరాల భూమి రాలేదని,కేజి నుండి పీజీ వరకు ఉచిత విద్య అందలేదని సకాలంలో ఉద్యోగులకు ఉద్యోగాలు రాలేదని,ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితికి తెలంగాణ దిగజారిందని ప్రాజెక్టుల పేరుతో రీ డిజైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టి తెలంగాణ ప్రజలకు మాత్రం ఒక్కొక్కరి పైన లక్ష రూపాయల అప్పు పెట్టిందని రాబోయే రోజుల్లో ఈ అప్పు ఇంకా పెరిగే పరిస్థితి ఉంది తగ్గే పరిస్థితి లేదని ఇప్పటికే అనేక ప్రభుత్వ ఆస్తులను వేలం వేస్తూ గత 60 సంవత్సరాల నుంచి పాలించిన ముఖ్యమంత్రులు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టలేదని కానీ కెసిఆర్ మాత్రం ఏకంగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అందరు గమనించి రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సాయినాథ్ భీమ్ సాగర్ ప్రేమ్చంద్ సురేందర్ రాజేందర్ రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.