బంద్ జయప్రదం

 

* విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ పతనం తప్పదు

* వామపక్ష విద్యార్థి సంఘాలు

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
కరీంనగర్ జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని పాఠశాల, జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం అయింది. వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రైవేట్ పాఠశాలలు,జూనియర్ కళాశాలలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల,కళాశాలల విద్యార్థులు బంద్ కి మద్దతు ప్రకటించి తరగతులు బైకట్ చేశారు .ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ
13 వందల మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాలు గడిచిన విద్యా వ్యవస్థలు ఎటువంటి మార్పు రాలేదని రోజురోజుకు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు పేదలకు విద్య దూరం చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు కార్పొరేట్లకు తొత్తుగా మారి విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరణ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడిచినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎక్కడ కూడా పుస్తకాలు, యూనిఫాం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆగస్టు 1వ తేది దగ్గరకు వచ్చిన చిరిగిన బట్టలతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు మన ఊరు మన బడి ప్రణాళిక పేరుతో కేవలం కొన్ని పాఠశాలలకు మాత్రమే నిధులు కేటాయించి మిగతా పాఠశాలలో కనీస వసతులు చాక్పీసులు, డస్టర్ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకుండా విద్యార్థులకు పోషకమైన ఆహారాలు ఇక్కడ నుంచి లభిస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలన్నారు పేద విద్యార్థుల జీవితాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్న అటువంటి పరిస్థితి ఉందన్నారు ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తానని ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి పరిస్థితి ఇప్పటివరకు దాన్ని అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు కేవలం అధికారాన్ని ఎలా చేసుకోవాలో అనే ఆలోచనలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ విద్యా వ్యవస్థ గురించి పట్టించుకునే పాపాన పోలేదన్నారు అంతేకాకుండా ఖాళీగా ఉన్న అధ్యాపక టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా కార్పొరేట్ విద్యా సంస్థల ఏర్పాటు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వారి రక్తాన్ని పీడిస్తూ కేవలం విద్య అంటే వ్యాపారంగా మారుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు అంతేకాక పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఈనెల 20వ తేదీన జరిగే వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలో ఇంటర్ కళాశాలల బందుకు విద్యార్థులు, యాజమాన్యం, అధ్యాపకులు మేధావులు ప్రతి ఒక్కరు సహకరించి బంద్ నీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృత్ఞతలు రానున్న రోజుల్లో విద్యారంగ సమస్యల పరిష్కారానికి మిలిటెంట్ ఉద్యమాలకు విద్యార్థులకు సిద్దం కావాలని వారు పిలుపునిచ్చారు

ఈ బంద్ కార్యక్రమం లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనగిరి మహేందర్,
పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శనిగరపు రజినీకాంత్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు రత్నం రమేష్,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు,కార్యదర్శి మచ్చ రమేష్, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి యుగెంధర్, ఏ ఐ ఎఫ్ బి జిల్లా కార్యదర్శి రాజశేఖర్ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మామిడిపల్లి హేమంత్, కంపెల్లి అరవింద్,రోహిత్, సందీప్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు