బచ్చన్నపేటలో భారతదేశ 75వ స్వతంత్ర వారోత్సవాలు
.. పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
బచ్చన్నపేట ఆగస్టు 11 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఘనంగా నిర్వహిస్తున్న 75వ భారత దేశ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం రోజున జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారి ఆధ్వర్యంలోఫ్రీడం రన్ కార్యక్రమం బచ్చన్నపేట మండల కేంద్రం లోని ప్రధాన చౌరస్తా నుండి ఉదయం 6 గంటలకు జరిగిందని టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి అన్నారు అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ వజ్రోత్సవాలు ప్రజల్లో స్వతంత్ర కలిగించేందుకే అదేవిధంగా జెండా ప్రాముఖ్యతను తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఇరి రమణారెడ్డి జనగామ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య ఎంపిపి బి నాగజ్యోతి కృష్ణంరాజు మండల యువజన నాయకులు ఉపేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు గంధ మల్ల నరేందర్ కోఆప్షన్స్ సభ్యులు షబీర్ మండల కార్యదర్శి గుర్రం బాలరాజు ఫిరోజ్ మైనార్టీ నాయకులు ఎండి అజీమ్ సందీప్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు