బతుకమ్మ పండుగ కనుక మరియు పెన్షన్లు కార్డులు పంపిణీ
బషీరాబాద్ సెప్టెంబర్ 24,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో శనివారం రోజున స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ పండుగ కానుకగా మొదటగా కొర్వి చేడ్ గ్రామంలో తర్వాత బషీరాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ చీరలు మరియు ఆసరా పెన్షన్స్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన కేసీఆర్ ముఖ్యమంత్రిది అని సభాముఖంగా చెప్పారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు రైతుల కోసం రైతుబంధు రైతు బీమా వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళకు బోదకాలు మరగుజ్జు పెన్షన్లు పెట్టారు.తాగునీరు కోసం మిషన్ భగీరథ ఇలాంటి ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టారని చెప్పారు.ఈ కార్యక్రమాలో తాహశీల్దార్ ఎన్.వెంకట్ స్వామి,ఎంపీడీవో రమేష్, డిప్యూటీ తాహశీల్దార్ విరేష్ బాబు, ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, వైస్ ఎంపీపీ జెడల అన్నపూర్ణ, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి,జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజరత్నం, వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రాము నాయక్ పి.ఏ.సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, సర్పంచ్ పూడూరు ప్రియాంక ఎంపీటీసీ పవన్ ఠాకూర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు రెడ్డి (నర్సిరెడ్డి), మధు పటేల్ , నరేష్ చావన్, టీ ఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.