బదిలీల మార్గదర్శకాలను సవరించాలని యుటిఎఫ్‌ ధర్న

కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటివల ఉపాధ్యాయ సంఘలతో చర్చలు జరిపి బదిలీలకు సంబందించి 38జీవో విడుదల చేసింది అయితే యుటిఎఫ్‌ సూచించిన అంశాలను పక్కకుపెట్టారని దీనీ ద్వారా చాలా కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని అందువలన మేము సూచించిన డిమాండ్ల ప్రకారం మార్పులు చేయాలని కరీంనగర్‌ విధ్యాదికారి కార్యలయం ఎదుట ధర్న నిర్వహించారు.  వీరు ప్రతిపాదించిన డిమాండ్లు గణితం పోస్ట్‌లో పనిచేసే ఉపాద్యాయులకు గతంలో పనిచేసిన సర్వీస్‌ ప్రకారం బదిలీకి అవకాశం కల్పించాలని. ఉపాద్యాయుల అంతర్‌ జిల్లా బదిలీలకు అవకాశం కల్పించలని, హైస్కూల్‌ హెడ్‌మాస్టర్ల బదిలీకి 8 సంవత్సరాలుగా ఉన్న సర్వీసును 5సం కుదించి 0సర్విసుతో బదిలయ్యే అవకాఖం ఇవ్వాలని, ఎస్‌జీటి పోస్ట్‌ కాళీలు బ్లాక్‌ చేసే విదానం తోలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు జి.ఆశోక్‌, ఏ.లక్ష్మరెడ్డి, ప్రతాప్‌ రావు, మల్లయ్య, అరుణ్‌ కుమార్‌, సత్యనారయణ, అంజయ్య, మురళీధర్‌, కమలాకర్‌, జయవర్థన్‌, వీరేందర్‌ తదితరులు పాల్లోన్నారు.