బయార్యంలోనే ఉక్కు కర్మాగారం చేపట్టాలి: దత్తాత్రేయ
ఖమ్మం సంక్షేమం: బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో భాజపా ఆందోళన చేపట్టింది. జిల్లా భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ప్రదర్శనను మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ బయ్యారంలోని ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టాలని లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి , జిల్లా నాయకులు విద్యాసాగర్‌రావు, లలిత , భాగ్యలక్ష్మి తదితరుల పాల్గొన్నారు.