‘బయ్యారం అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి’
హైదరాబాద్; బయ్యారం గనుల అంశంపై టీడీపీ,టీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. ఆందుకే బయ్యారం విషయాన్ని తెలంగాణలో ముట్టుపడి రాజకీయం చేస్తున్నారన్నారు. అధికారుల అక్రమ మైనింగ్‌పై ఆ రెండు పార్టీ నేతలు ఎందుకు స్పందించరని ఆయా పార్టీ నేతలు ఈ సందర్భంగా సుదాకర్‌రెడ్డి ప్రశ్నించారు.