బషీర్బాగ్ విద్యుత్ అమరుల త్యాగాల స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలు

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపు
కేసముద్రం ఆగస్టు 28 జనం సాక్షి / విద్యుత్ సంస్కరణల పేరుతో, ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గిన పాలకులు ప్రజలపై పెనుబారం మోపే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసి, ప్రాణాలను బలిపెట్టి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించిన తీరు అత్యంత సహోసపేతమైనదని ఆ స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలను కొనసాగించాలని సిపిఎం పార్ట మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఆదివారం రోజున మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆఫీసులో జాటోత్ వెంకన్న అధ్యక్షతన సిపిఎం కేసముద్రం మండల కమిటీ సమావేశము జరిగింది .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాధుల శ్రీనివాస్ ప్రసంగిస్తూ…ఈరోజు బిజెపి మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తెలంగాణలో బలపడాలని తద్వారా దక్షిణ భారతదేశంలో తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నది అన్నారు. బండి సంజయ్ తను చేస్తున్న పాదయాత్ర సందర్భంలో సాయిధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ అమరుల త్యాగాలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. భవిష్యత్తులో కమ్యూనిస్టు కార్యకర్తలు స్థానిక పోరాటాలు తీవ్రతరం చేసి, గ్రామాలలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు . ఈ సమావేశంలో మండల నిర్మాణ బాధ్యులు గునిగంటి రాజన్న ,సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎం పాపారావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మోడెం వెంకటేశ్వర్లు, చాగంటి కిషన్ ,వేల్పుగొండ సావిత్రమ్మ, సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజ్  తదితరులు పాల్గొన్నారు.