బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుజువులోని ఉద్యమం పుస్తకావిష్కరణ చేస్తున్న విశాలాంధ్ర మహాసభను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. రుజువులేని ఉద్యమం పుసకాన్ని తెలంగాణ వాదులు కాల్చేశారు. అనంతరం విశాలాంధ్ర మహాసభ నిర్వహకులపై దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌ వద్ద తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ ఆందోళన చేపట్టింది. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పుస్తకావిష్కరణకు వచ్చిన పరకాల ప్రభాకర్‌ను అక్కడి నుంచి పోలీసులు తరలించారు. రుజువులేని ఉద్యమం పుస్తకవిష్కరణకు ఎలా అనుమతించారంటూ తెలంగాణ జర్నలిస్టులు ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.