బస్తీ దవఖాన కోసం పరిశీలన చేసిన డియం హెచ్ఓ

అయిజ, సెప్టెంబర్ 21 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బస్తీ దవఖాన కోసం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి చందునాయక్ సంతబజార్లో బాలికల ఉన్నత పాఠశాల ముందు ఉన్న రూములను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు బస్తీ దవఖానలు మంజూరి అయ్యాయి గద్వాలలో ఒకటి రెండవది. అయిజమున్సిపాలిటీలో ఒకటి ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయని, బస్తీ దవఖాన ఏర్పాటు అయితే అందులో భాగంగానే పరిశీల చేయడం జరిగింది, డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. ఒక్కో దవఖానకు 13.50 లక్షలు ఖర్చు చేస్తున్నామని బస్తీ దవఖానలో డాక్టర్లు ఉదయ 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటారని అలాగే ఈవెనింగ్ స్పెషలైజేషన్ 6 నుండి 8 గంటల వరకు డాక్టర్లు, స్టాఫ్ ఎక్స్ రెలు అందుబాటులో ఉంటాయని ల్యాబ్ లో సమారు 31 రకాల టెస్టులు చేస్తారని తెలిపారు. అనంతరం ఆయన జోగులాంబ సెంట్రల్ ల్యాబ్ నుంచి అనేక పిర్యాదుల అనంతరం పరిశీలించి వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు అక్కడ ఉన్న పేషెంట్లను ఎవరు రెఫర్ చేశారని అందరిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల సలహా లేకుండా ఎలా స్కానింగ్ చేస్తారని వారిని హెచ్చరించారు. ఆర్ యంపిలు రెఫర్ చేస్తే మీపై కఠిన చర్యలు తీసుకొని సీజ్ చేస్తామని వాచ్చరించారు. అలాగే బ్రహ్మారెడ్డి హాస్పిటన్ పరిశీలించారు. ఇక్కడ అందిచే వైద్యం చేయిస్తే చర్యలు తప్పవని అన్నారు. అలాగే బి. సెంటర్ బీహెచ్ ఎన్డిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రోగ్రాడ్ ఆఫీసర్ , ఇర్నాడ్, సిసి వెంకటేష్, సూపర్వైజర్ ఓబులేష్ ఉన్నారు.
Attachments area