బస్సు రాకపాయేనని సర్పంచ్ ఎదురుచూపులు !
రామారెడ్డి అక్టోబర్ 20 ( జనంసాక్షీ ) :
బస్సు రాలేదని గ్రామ సర్పంచ్ ఎదురుచూసిన సంఘటన రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి విద్యర్థుల వద్దకు వెళ్లి ముచ్చటించారు. ప్రతి రోజు విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సరైన సమయానికి రావడం లేదని విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని, విద్యార్థులతోని కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, పోసానిపేట్ గ్రామంతో పాటు చుట్టుముట్టు పల్లెలకు కళాశాల కు వెళ్లే విద్యార్థులకు సరైన సమయానికి బస్సు రావట్లేదని ఆవేదన చెందారు. ఆర్టీసీ డిపో మేనేజర్, డిఎం ,ఆర్టిసి ఎండి, చైర్మన్ , తదితరులకు ఫోన్లో మాట్లాడిన ఫలితం శూన్యమని అన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం అన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు అందని ద్రాక్షగానే ఉందన్నారు. సమయపాలన పాటించకుండా ఆర్టీసీ బస్సులు నడపడం, అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు ఉండడం గమనార్హం అన్నారు. రామారెడ్డి మండలానికి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సౌకర్యవంతమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో