బస్సు సౌకర్యం లేకఇంటర్మీడియట్ విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు

మల్దకల్ జులై 22 (జనంసాక్షి) మల్దకల్ మండలంలోని  విఠలాపురం,మల్లెందొడ్డి, ఏల్కూరు,నీలిపల్లి ,చర్ల గార్లపాడు గ్రామాలను కలుపుతూ మల్దకల్ మండల కేంద్రానికి చేరుకునే బస్సు సౌకర్యం లేనందువలన ఆ గ్రామాల నుండి విద్యార్థులు మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరడం లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ జూనియర్ కళాశాల మనుగడే ప్రమాదకరంగా ఉంది. చివరికి రేషనల్లైజేషన్లో భాగంగా కళాశాల ఇక్కడినుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దయచేసి పలు గ్రామాల నుండి మల్దకల్ మండల కేంద్రానికి బస్సు సౌకర్యాన్ని పునరిద్ధరించడం కొరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మండల కేంద్రంలో నిలబడడం కోసం మండల ప్రజా ప్రతినిధులు మీ వంతుగా గట్టి ప్రయత్నం చేయాలని,ఈ ప్రయత్నంలో మేము కూడా మీకు ఎల్లవేళలా వెంటనే ఉంటామన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్దకల్ అధ్యాపక బృందం,ప్రిన్సిపాల్ఈ సంవత్సరం కళాశాల టాపర్ గానిలిచిన శ్వేత అనే అమ్మాయి 440 మార్కులు కార్పొరేట్ కళాశాలగా దీటుగా తెచ్చుకున్నప్పటికీ బస్సు సౌకర్యం లేనందువలన విద్య మానివేసే స్థితిలో ఉన్నది. దయచేసి ఈ పరిస్థితి కొనసాగితే పేద విద్యార్థులు విద్యకు దూరంగా ఉంటారు. కళాశాల మూసివేసే పరిస్థితి వస్తుంది.ఈ పరిస్థితిని నాయకులు, మీడియా ప్రతినిధులు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మండల కేంద్రానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి ముఖ్యంగా పైన పేర్కొన్న గ్రామాల నుండి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించడం కోసం గట్టి ప్రయత్నం చేసి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
Attachments area