బహదూర్ సేవలు స్ఫూర్తిదాయకం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి )
తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగానికి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అందించిన సేవలు స్పూర్తి దాయకమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ చిత్ర పటానికి పూలమాల వేసి మంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటి రంగానికి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ చేసిన సేవలు స్పూర్తి దాయకమని వారిని ఆదర్శంగా తీసుకొని ఇరిగేషన్ ఇంజనీర్లు, ఇతర శాఖలకు చెందిన ఇంజనీర్లు జిల్లా అభివృద్ధి కొరకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎలక్ట్రిసిటీ ఏస్ఈ గంగాధర్, ఆర్ అండ్ బి ఎస్ఈ, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా నీటిపారుదల అధికారి అస్మత్ అలీ, ఈఈ శ్రీనివాస రావు గుప్తా, డి ఈ ఈ శ్రీనివాసులు, ఏఈఈ వాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.