బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.
మర్పల్లి సెప్టెంబర్ 02 (జనం సాక్షి) ఆగస్టు 25వ తారీఖున ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు చనిపోయారని, చనిపోయిన మహిళల కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, చనిపోయిన కుటుంబానికి 50 లక్షల ఇవ్వాలని మర్పల్లి మండల బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, మండల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆసుపత్రి ఎదురుగా బీఎస్పీ మండల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చావులకు కారణమైన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే రాజీనామా చేయాలని వారు అన్నారు. ఈ ధర్నా లో మైనార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ అమీర్, ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్, కార్యదర్శి కావాలి ప్రభాకర్, మర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రవి, విజయ్, కోటేశ్వరరావు, శీను, ప్రవీణ్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.