బహుజన రాజ్యాధికార సంకల్ప సభ

 

కరపత్రాలు విడుదల.

కోడేరు (జనంసాక్షి) జూలై 20 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం
కోడేరు మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బహుజన రాజ్యాధికార సంకల్ప సభ కరపత్రాలను మండల ఇన్చార్జి దేవరపాగ శివ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ కేశపాగ వెంకటేష్ మరియు వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె మహేష్. హాజరై మాట్లాడడం జరిగింది. ఆగస్టు 7 తారీఖు రోజున జరిగే బహుజన రాజ్యాధికార సంకల్ప సభ కు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ అలాగే అగ్రవర్ణ పేదలు అధిక సంఖ్యలో పాల్గొని భారీ బహిరంగ సభను విజయవంతం చేయగలరని పిలుపునివ్వడం జరిగింది బీసీలకు రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీ తోనే సాధ్యమని అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 70 సీట్లు కేటాయించే ఏకైక పార్టీ అని తెలిపారు,ఆగస్టు 7న వనపర్తి లో జరిగే బహుజన రాజ్యాధికార సంకల్ప సభ కు ముఖ్యఅతిథిగా ప్రవీణ్ కుమార్ IPS (VRS) పాల్గొంటారు. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భీమపాగ శంకర్, మండల కన్వీనర్లు ఆది దానయ్య, విక్రమ్, మబ్బు రాము, ఐలయ్య, తదితరులు పాల్గొనడం. జరిగింది