బహుజన సామాజిక పార్టీ తోనే బహుజనులకు రాజ్యాధికారం

బహుజన సామాజిక పార్టీ తోనే బహుజనులకు రాజ్యాధికారం

పెన్ పహాడ్,  నవంబర్ 05  (జనం సాక్షి) :  బహుజన సామాజిక  పార్టీతోనే బహుజనులకు రాజ్యాధికారం చేకూరుతుందని బీఎస్పీ పార్టీ సూర్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఒట్టే జానయ్య యాదవ్ అన్నారు.ఆదివారం మండల కేంద్రంతోపాటు మాచారం దుపాడు గ్రామాల్లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు ఏండ్లు గడిచిన 90 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీీలు ఒక్క శాతం ఉన్న ఓసీలు బహుజనులకు రాజ్యాధికారం అందించకుండా పరిపాలన సాగిస్తున్నారని ఈ దొరల , రెడ్ల,పరిపాలన అంతం కావాలంటే రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు అనంతరం అంతకుముందు
బి ఎస్ పి మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు . వివిధ గ్రామాలకు చెందిన పార్టీల కార్యకర్తలు బీఎస్పీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భీంపంగి నాగరాజు, అసెంబ్లీ అధ్యక్షులు నకేర కంటి వెంకన్న , బీఎస్పీ నాయకులు గండూరి కృపాకర్, దండూరి రమేష్, ఆవుల అంజయ్య, బోల్లక లింగయ్య ఒగ్గు వెంకన్న, రణపంగ శ్రవణ్, రాజేష్,  మచ్చ నరేష్, ఒగ్గు కిరణ్, కొండమీది బుచ్చిబాబు, గూడపూరి దుర్గాప్రసాద్,  మామిడి వెంకటేశ్వర్లు,
తదితరులు పాల్గొన్నారు