బహుమతి ప్రధానం చేస్తున్న తహసిల్దార్
వ్యాసరచన పోటీలో గట్ల నర్సింగాపూర్ విద్యార్థిని ప్రథమ బహుమతి
భీమదేవరపల్లి,మండలం అక్టోబర్ (12)
జనంసాక్షి న్యూస్
ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం విద్యార్థులకు ప్రపంచ ఆహార భద్రత స్థితిగతులపై మండల స్థాయి వ్యాసరచన పోటీలు బుధవారం తాహసిల్దార్ ఉమా దేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బలహీనవర్గాలను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రంలో ఆహార భద్రత స్థితిని మెరుగుపరచడానికి మార్గాలు అనే అంశంపై మండలంలోని హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తాహసిల్దార్ తెలిపారు. వ్యాసరచన పోటీలలో మొదటి బహుమతి గట్ల నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వర్షిత, రెండవ బహుమతి జెడ్ పి హెచ్ ఎస్ భీమదేవరపల్లి పాఠశాలకు చెందిన అంజు శ్రీ, మూడవ బహుమతి ములుకనూరు మోడల్ స్కూల్ కు చెందిన పూజిత, నాలుగవ బహుమతి ములుకనూరు మోడల్ స్కూల్ కు చెందిన రాహుల్ వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్, మండల విద్యాధికారి వెంకటేశ్వరరావు , ఐసిడిఎస్ సిడిపిఓ స్వరూప, జెడ్ పి హెచ్ ఎస్ భీమదేవరపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area