బాంబు పేలుళ్ల మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం
ఇంజనీరింగ్ కళాశాలలు జేఎన్‌టీయూ పరిధిలోకి
మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్,మార్చి7(జనంసాక్షి):
దాదాపు వంద రోజుల విరామం తర్వాత సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సాయంత్రం సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలను చర్చించింది. రాజకీయ అంశాలకు తావు లేకుండా పలు అంశాల పై చర్చిచారు. అనంతరం సమాచారశాఖమంత్రి డికె అరుణ వివరాలను విూడియాకు వెల్లడించారు. బాంబు పేలుళ్ళు, జాతీయ భద్రతా హెచ్చరికలు… రాష్ట్రంలో వేసవికి ముంచు కొస్తున్న తాగునీటి కొరత, విద్యుత్ కోతలు తదితర అంశాలను చర్చించారు. విద్యుత్ ఛార్జీలను పెంచవద్దని, ఈ విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించాలని పలువురు మంత్రులు సూచించారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం సరికాదని మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, సి. రామచంద్రయ్యలు సూచించినట్లు సమాచారం. ప్రధానంగా ఇటీవల పేలుళ్లలో మరిణించిన వారి కుటుంబాలల్లో ఒకిరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి కూడా ఇది వర్తింప చేస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,599 పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదం లభించింది. అలాగే జీహెచ్‌ఎంసీ చట్టంలో 9 సవరణలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 25 ఏళ్లు పైబడిన స్థలాలలీజులను సవిూక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తగా 122 న్యాయస్థానాల ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం లభించింది. పది శాఖల్లో 3,599 ఖాళీల భర్తీకి మంత్రివర్గం ఆమోదించింది.
36 రెగ్యులర్ కోర్టులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మార్చాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీలో 2600, న్యాయవిభాగంలో 86 పోస్టుల భర్తీకి మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను ఇక అన్నీ జెఎన్‌టియూ పరిధిలోకి తీసుకరావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన చట్టాన్ని వచ్చే అసెంబ్లీలో ఆమోదసి/-తారు. వివిధ యూనివర్సిటీల పరిధిలో ఉండడం వల్ల వాటి సిలబస్, పరీక్షల విధానాల్లో తేడాలను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సహకార సంఘాలు లాభాపేక్ష లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నందున దానిని వ్యాట్ పరిధి నుంచి మినహాయించాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా వాయల్పాడు ఉర్దూ జూనియర్క కాలేజీలో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.హైదరాబాద్ యునాని ఆస్పత్రిలో వసతుల మెరుగుకు 10కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ నెల 13నుంచి మొదలుకానున్న శాసనసభ బ్జడెట్ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరి పెద్దగా చర్చించినట్లు లేదు. రానుంది. సాధారణ బ్జడెట్ నుంచి వ్యవసాయ బ్జడెట్‌ను వేరుచేయడం, స్థాయీ సంఘాల ద్వారా చర్చకు అవకాశం కల్పించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. పదో పీఆర్సీ ఏర్పాటు, హెల్త్‌కార్డుల విషయంపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులపైనా చర్చ జరిగింది. విద్యుత్ కోతలపైనా చర్చ జరిగింది.