బాగ్వాన్ కరీం కుటుంబ సభ్యులను ఓదార్చిన… రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్.

తాండూరు అక్టోబర్ 21(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాగ్వాన్ కరీం మృతి పట్ల రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యలు శుభప్రద్ పటేల్ తీవ్ర సంతాపం తెలిపారు. కరీం మృతి చాలాబాధకరమన్నారు. తాండూర్ లారీ పార్కింగ్ లోని కరీం నివాసంలో వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు శుభప్రద్ పటేల్ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మైనార్టీ నాయకులు ట్రాన్స్ పోర్ట్ ఘనీ ,ట్రాన్స్ పోర్ట్ డాక్టర్ భాయ్, మహమ్మద్ యూసుఫ్,  ఆబీద్ చౌష్ భాయ్, భాను, విజయ్, తదితరులు ఉన్నారు.