బాటసారులకు మజ్జిగ పంపిణీ
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 27(జనం సాక్షి)
భారతీయ జనతా పార్టీ సభకు బయలుదేరిన బాటసారులకు ప్రజలందరికీ వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ఖమ్మం రోడ్డులో సిద్ధం నరేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం శనివారం చేపట్టారు.ఎర్రటి ఎండలో వేలాదిగా వచ్చిన ప్రజలకు బిజెపి కార్యకర్తలకు, మహిళలకు మజ్జిగ పంపిణీ చేసి వారి దాహార్తిని తీర్చిన సిద్ధం నరేష్ వారి కుటుంబ సభ్యులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.