బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం.
దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి.
మండల పరిధిలో చెట్ల నర్సంపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబమైన దొడ్డి స్వామి గత మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకొని తన పదవ తరగతి ఫ్రెండ్స్, గ్రామ పాలకవర్గం, గ్రామ ప్రజలు16800రూపాయలు, దాతల సహకారంతో,17500రూపాయలు ఒక క్వింటాల్ బియ్యం ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమం చేసిన,సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని గ్రామ సర్పంచ్ వేమ జనార్ధన్ తెలిపారు.