బాధిత కుటుంబానికి భరోసా …
ఇంటి నిర్మాణానికి రూ.40 వేల ఆర్థిక సహాయానికి హామీ
విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి
మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలం లంకాల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామానికి చెందిన అవుసలి శ్రీనివాసులు మట్టిమిద్దె పూర్తిగా పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న వీజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి నర్వ మండలం లంకాల గ్రామాన్ని సందర్శించి అవుసలి శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద కుటుంబానికి చెందిన అవుసలి శ్రీనివాసులు కుటుంబ పరిస్థితులను కళ్లారా చూసిన వీజేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వర్కటం జగన్నాథ్ రెడ్డి నూతనంగా ఇంటిని నిర్మాణం చేపట్టినట్లయితే నాలభై వేల రూపాయల విలువ గల రేకులు, సిమెంటు బ్రిక్స్ ను అందజేస్తానని ఆయన బాధితులకు సూచించారు. అంతేకాకుండా నిత్యవసర వస్తువులను కూడా ఆయన అందజేస్తానని హామీ ఇచ్చారు. జగన్నాథ్ రెడ్డి సాయం వలన ఆ కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేద కుటుంబమైన శ్రీనివాసులు కుటుంబానికి నాలభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయ్యడం పట్ల గ్రామ ప్రజలు యువకులు గ్రామపెద్దలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ఎంపీటీసీ చంద్రకళ శంకరయ్య ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంటును అందజేస్తానని హామీ ఇచ్చారు. వీరి వెంట సీనియర్ పాత్రికేయులు బీసం రామకృష్ణ, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ వెంకటేష్ సాగర్, గ్రామ పెద్దలు విష్ణు సాగర్, విజయ్ కుమార్, కోట్ల శ్రీనివాసులు విశ్రాంత ఉపాధ్యాయులు బ్రహ్మయ్య, డీకే జనార్దన్, త్రివేణి కుమార్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.