బానిసత్వం నుంచి బయటపడదాం

2

తెలంగాణకు ప్రతిరూపంలా సిలబస్‌

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి

కరీంనగర్‌, ఫిబ్రవరి 12 (జ నంసాక్షి) : తెలంగాణలోని ప్రతి అవకాశం ఇక్కడి బిడ్డలకు దక్కాలనే ఆతృతతో చేస్తున్న కసరత్తును కూడా కొంత మంది జీర్ణించుకోవడంలేదని దళితుడినైన నా దిష్టిబొమ్మలు కూడా అవే వర్గాలకు చెందిన కొంత మంది కాల్చుతూ ఆందోళనలు చేస్తున్నారని ముందు పరాదీనత నుంచి బయటపడాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి హితవు చెప్పారు. గురువారం కరీంనగర్‌లో భాగ్యనగర్‌ విజయ్‌కుమార్‌భవన్‌లో జరిగిన ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. టిపిఎస్‌కు అలాటైన ఉద్యోగులకు ఎల్‌పిసి ఇవ్వకుండా, కనీసం ఫర్నీచర్‌ ఇవ్వకుండా ఎపిపిఎస్‌సి దౌర్జన్యం చేస్తన్నదని మరోవైపు గెజిటెడ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ మన విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని ఇలాంటి పరిస్థితిలో నోటిఫికేషన్‌ల జాప్యం జరగడం సహజమేనని అన్నారు. ఇప్పుడు కూడా టిపిఎస్‌ కార్యాలయంకు తాళం వేస్తే గొడవ జరుగుతోందని ఇంతటి అనిశ్చితిలో ఉద్యోగ నియమకాలు చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. తెలంగాణ యువత ఉపాధికి 371డితో స్థానికేతర ముప్పు పొంచి వుందని మీరు ఓపెన్‌ కేటగిరిలో ఉద్యోగాలు  సంపాదించాలంటే తెలంగాణ ఇతివృత్తంగా సెలబస్‌ మార్పు చేయాల్సి వుంటుందని తెలిపారు.  371 డి ప్రకారం రాష్ట్రం విభజించినా ఇంకా నాన్‌గెజిటెడ్‌లో 85శాతం లోక్‌ రిజర్వేషన్‌ పోగా  15శాతం ఓపెన్‌ కోటా కింద ఇతర ప్రాంతాలవారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని అదే విథంగా గెజిటెడ్‌లో 60శాతం స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్‌ కల్పించినా మిగితా 40శాతం ఓపెన్‌ కోటాలో ఉద్యోగాలు పొందే వెసులు బాటు వుంటుందని తెలిపారు. తెలంగాణ విద్యార్థులు తమ ప్రతిభకు మరింత మెరుగు పెట్టి ఓపెన్‌ కోటాలో కూడా ఉద్యోగాలు పొందేలా పోటీ పరీక్షకు తయారు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రావాళ్ళు వెళ్ళకుండా వేలాడుతున్నారని దీనికి తోడూ కమలనాథన్‌ కమిటీ సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే వుండేలా అనేక రకాల నియమాలు పెడుతున్నారని దీనికి తోడు కాంట్రాక్టు ఉద్యోగుల లెక్క కూడా చూడాల్సి వుందని ఇవన్నీ తేలితే గ్రూప్‌వన్‌  గ్రూప్‌ టూ నియామక ప్రకటన వస్తుందని చెప్పారు.  ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, విద్యుత్‌,  వాటర్‌గ్రిడ్‌ వంటి ఇంజనీరింగ్‌ ఉద్యోగ నియమాకాల ప్రకటనల వచ్చే రెండు మూడు వారాల్లో  ఇస్తామని మిగితావి కమలనాథన్‌ కమిటీ ఉద్యోగుల పంపిణీ తర్వాత ఇస్తామని చెప్పారు. ఉద్యోగ నియామకాల  సెలబస్‌ తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా ప్రజాసంఘాల్లో వున్న వారు రూపొందిస్తున్నారని ఇది ప్రజల చేత ప్రజల సేవకులను నియమించుకొనేందుకు రూపొందుతున్న సెలబస్‌ అంటూ ఘంటా చక్రపాణి వర్ణించారు. ముప్పైఏళ్ళ వరకు తెలంగాణ పరిపాలన ఎలా వుండాలో దిశ దశ తెలిపే విధంగా ఈనియమక ప్రక్రివుంటుందని చెప్పారు. ప్రతిభకు పట్టం కట్టేలా పారదర్శంగా నియామకాలు చేస్తామని చెప్పారు. పక్షపాతం ఆశ్రిత పక్షపాతం వుండదని ఎస్సీఎస్టీబిసి రిజర్వేషన్‌లు ఖచ్చితంగా అమలు చేసి వారికి న్యాయం చేస్తామని చెప్పారు. రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకొని పైరవీలు లేకుండా కొత్త ఒరవడికి తెరతీస్తామని తెలిపారు. ఆలిండియా రేడియో రిటైర్డు న్యూస్‌ ఎడిటర్‌ జెబిరాజు మాట్లాడుతూ చక్రపాణి సాంఘిక నిబద్దత కల ఒక విజ్ఞాని అని కొనియాడారు. లోక్‌సత్తా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్‌ సామాజికన్యాయం  ఆచరించే ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అన్నవరందేవేందర్‌, బిక్షపతి, తీట్ల ఈశ్వరి, ఎపియుడబ్ల్యుజె జిల్లా అధ్య్ష,కార్యదర్శి  తాడూరి కరుణాకర్‌, గాండ్ల శ్రీనివాస్‌, ఎలగందల రవీందర్‌, ఐలరమేశ్‌, వైఎస్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.