బాప్టిస్ట్ కళాశాల వార్షికోత్సవాలు
వినుకొండ, జూలై 19 : పట్టణంలోని ఎబిఎం కాంపౌండ్‌లో డోస్మన్ బాప్టిస్ట్ బైబిల్ కళాశాల వార్షికోత్సవాలను జాషువా గురువారం ప్రారంభించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అభ్యర్థులకు బైబిల్ కళాశాలలో ప్రవేశం ఉందని అన్నారు. కళాశాలలో అనుభవం గడించిన ఉపాధ్యాయులచే తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినుకొండ ప్రాంతంలోని సేవకులు, యువకులు బైబిల్ తరగతులకు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బి.సుమంత్‌కుమార్, అబ్రహాం, తదితరులు పాల్గొన్నారు.