బాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ ను.. సోనియా వినిపించారు

– ఏపీపై సానుభూతిని చూపారు

– ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తే తెలంగాణకు నష్టం

– తెలంగాణకు పారిశ్రామిక రాయితీపై ఎందుకు మాట్లాడలేదు?

– సోనియా ప్రసంగంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి

– కాంగ్రెస్‌ విూటింగ్‌తో ప్రజలకు ఆపార్టీపై నమ్మకం పోయింది

– కేసీఆర్‌ పాలనే శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారు

– ఎన్ని పార్టీలు కలిసొచ్చిన ఎదుర్కొనే సత్తామాకుంది

– పాలమూరును కోనసీమగా మార్చుతాం

– విలేకరుల సమావేశంలో ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు

మహబూబ్‌నగర్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన స్టిప్ట్ర్‌ నే సోనియాగాంధీ చదివి వినిపించినట్లుగా ఉందని, సోనియా ప్రసంగంలో మొత్తం ఏపీపై సానుభూతి చూపారని ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. శనివారం మహమబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులలో పర్యటించారు. ఈసందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు.. తెలంగాణలో ఎంతమంది పొత్తు పెట్టుకున్నా.. మాకు వచ్చే నష్టమేవిూ లేదన్నారు. ఎంతమంది కలిసొచ్చినా ఎదుర్కొనే సత్తా మాకు ఉందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఏపీపై సానుభూతి చూపారని అన్నారు. తెలంగాణలో సభ పెట్టి ఆంధప్రదేశ్‌కు హావిూలు ఇస్తారా? ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఆంధప్రదేశ్‌తో సమానంగా తెలంగాణకు కూడా పారిశ్రామిక రాయితీలు ఇస్తామన్నారని, తెలంగాణకు ఇస్తామన్న పారిశ్రామిక రాయితీలపై సోనియాగాంధీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సోనియాగాంధీ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని హరీష్‌రావు తెలిపారు. చంద్రబాబు రాసిచ్చిన స్కిప్టున్రు సోనియాగాంధీ చదివినట్లు ఉందన్నారు. సీట్లు పంచింది చంద్రబాబే.. స్కిప్టు రాసిచ్చింది కూడా చంద్రబాబే అని హరీష్‌ పేర్కొన్నారు. మొత్తానికి శుక్రవారం కాంగ్రెస్‌ విూటింగ్‌తో ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం పోయిందన్నారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని ప్రజలు కోరుకుంటున్నారని హరీశ్‌రావు చెప్పారు. తాగునీటి ప్రాజెక్టులను వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుకున్నా.. పాలమూరు జిల్లాను కోనసీమగా చేస్తామని హరీష్‌రావు హావిూ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా తొలగించేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది నెలల్లోనే పూర్తి చేశామని, నేడు నీటి విడుదలతో రైతులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై కూడా చంద్రబాబు ఫిర్యాదు చేశారన్నారు. తుమ్మిళ్ల పథకం వద్దంటూ చంద్రబాబు రాసిన లేఖను వెనక్కి తీసుకుంటారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సభలో రాహుల్‌గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కూటమిలో ఒకరికి ఒకరు సహకరించండి, తెలుగుదేశం, టీజేఎస్‌ నిలబడ్డ కాడా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓటేయండన్నారని అన్నారు. స్పీచ్‌ అయిపోయిన ఒకటే నిమిషంలో టీడీపీ నాయకుడు నరోత్తమ్‌ కాంగ్రెస్‌లో చేరుతుండని చెప్పి కండువాకప్పించారని, ఆ సమయంలో పక్కనే తెలుగుదేశం నాయకుడు ఎల్‌.రమణ ఉన్నాడని అన్నారు.

తెలుగుదేశం నాయకుడిని పక్కన ఉంచుకోని కాంగ్రెస్‌ కండువా కప్పారని, కూటమిల విూద విూకు ఎంత నమ్మకం ఉందో ఈ ఒక్క సంఘటన ఊదాహరణ అన్నారు. ఒకరి విూద ఒకరు బీ-ఫామ్‌లు ఇచ్చుకున్నరని, విూ విూదనే విూకు నమ్మకం లేకపోతే ఇంక తెలంగాణ ప్రజలకు ఎట్లా నమ్మకం కలుగుతుందని ప్రశ్నించారు. సోనియాగాంధీ సమావేశం తర్వాత టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగిందని హరీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ వాదుల్లో, తెలంగాణ అభిమానుల్లో కేసీఆరే శ్రీరామ రక్ష అని మరొక్కసారి స్పష్టం అయిందన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక ¬దా ఇస్తం.. తెలంగాణకు మొండిచేయి పెడతం అన్న తర్వాత తెలంగాణ బాగుండాలని కోరుకునే ప్రతిఒక్కరూ ఇక కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీయే మాకు శ్రీరామ రక్ష.. కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ హక్కులు కాపాడబడుతాయన్న విషయంలో మరింత స్పష్టత వచ్చిందని హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెరాస ఎంపీ జితేందర్‌ రెడ్డి, దేవరకద్ర టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఆల వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.