బాలకార్మికుల నిషేధానికి కొత్తచట్టం కావాలి

BALAKARMI

నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి17(జనంసాక్షి):  బాల కార్మిక నిషేధచట్టం అమలు తీరును సవిూక్షించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని నోబెల్‌ గ్రహీత, బాలల హక్కుల ఉద్యమ నేత కైలాష్‌ సత్యార్థి అన్నారు. బాల కార్మిక వ్యవస్థపై ఆయన మాట్లాడుతూ..”భారత్‌లో 60 లక్షల మంది బాలలు, జనాభాలో ఆరు శాతం మంది బలవంతంగా శ్రమలో మగ్గిపోతున్నారు. తల్లిదండ్రుల దారిద్యం, నిరక్షరాస్యత ఇందుకు కారణాలుగా ఉన్నాయి. బాధిత బాలలకు పునరావాసం కల్పించేవిధంగా వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం బాలకార్మిక నిషేద చట్టం 61కు సవరణ చేస్తూ చట్టం తీసుకురావాలని” ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి దత్తాత్రుయతో ఆయన చట్టంపై చర్చించారు. ఇటీవల వీరిద్దరూ కలసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై చర్చించారు.