బాలల పరిరక్షణ పోస్టర్ ను ఆవిష్కరించిన ఏ ఎస్ ఐ ముజిబ్ సిద్ధికి

బాలల పరిరక్షణ కమిటీ లను బలోపేతం చేద్దాం
సి డి పి వో. పద్మ
ఎల్లారెడ్డి 18 అక్టోబర్ జనం సాక్షి  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి  మండల పరిషత్ కార్యాలయం లోమంగళవారం సిడిపివో  పద్మ ఆధ్వర్యం లో మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ పోస్టర్ ను ఏ యస్ ఐ మూజిబ్ సిద్ధికి యంపి డివో మల్లికార్జున్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు  అనంతరం   జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధి కౌన్సిలర్ దత్తు మాట్లాడుతూ మండల స్థాయి కమిటీ  గురించి, బాలల చట్టాల గురించి వివరించారు, అనంతరం సిడీపివో పద్మ  మాట్లాడుతూ  బాల్యవివాహలు జరుగుతున్నట్లైతే 1098 ఫోన్ చెయ్యాలని కోరారు,  అక్రమ దత్తత చట్ట విరుద్ధం  దత్తత తీసుకునేవారు లీగల్ గా దత్తత తీసుకోవాలి అని, సూచించారు అనంతరం
చైల్డ్ లైన్ 1098 ప్రతినిధి దేవరాజ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 1098 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 24 గంటలు పనిచెయ్యడం జరుగుతుందని తెలిపారు, 0-18 సంవసరాల పిల్లలు బాల్యవివాహాలు,చేయరాదని  బిక్షాటన చేస్తున్న పిల్లలను స్కూల్ కి వెల్లేవిధంగా పోత్ర హించలని పేర్కొన్నారు  అనాధ పిల్లలు, బాలకార్మికుల పిల్లలు కనిపిస్తే వెంటేనే 1098 ఫోన్ చెయ్యాలి ఆని తెలియజేశారు.అనంతరం ఎంపీపీ మాధవి గౌడ్  మాట్లాడుతూ   బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి బాలల పై  పనిచేస్తూ వారికి రక్షణగా పనిచేస్తాయి  ఆని మండలంలో ఏమైనా బాలల సమస్యలు వుంటే గ్రామాల్లో పరిష్కారం కానివి మండలంలో మేము అందరం  కలిసి బాలల సంరక్షణ కొరకు పనిచేస్తూ పరిరక్షిస్తాము అని మాట్లాడారు, ఈ కార్యక్రమంలో  సూపర్వైజర్, కల్యాణి గ్రామ యంపి టిసి శ్రీధర్ గౌడ్ ,జడ్పీటిసి ఉషా గౌడ్   సర్పంచులు, అరొగ్య శాఖ,సూపర్ వెసర్ స్వచంద్ద సంస్థ ప్రతినిధి, ఐకేపీ అధ్యక్షురాలు స్కూల్ పిల్లలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Attachments area