బాలానగర్ డివిజన్ లో 7 వ రోజు పాదయాత్ర లో పాల్గొన్న ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు తో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
ఎమ్మెల్యే కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతూ మంగళహారలతో స్వాగతం పలికిన మహిళలు
కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్టు 08 కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏడవ రోజు పాదయాత్ర గణేష్ నగర్ ప్రారంభమై
వినాయక నగర్, జెపిఆర్ నగర్,దిల్ కుష్ నగర్ మీదిగా సాగిన పాదయాత్రలో అడుగడుగున ప్రజలు నీరాజనం పలుకుతూ మంగళహారలతో శాలువాలతో ఎమ్మెల్యే మాధవరం కి కాలనీవాసులు సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాలానగర్ డివిజన్ లో డ్రైనేజీల సమస్యలను పరిష్కరించామని కురిసిన భారీ వర్షాల కారణంగా పలు కాలనీలో రోడ్లపై సమస్యలను స్వయంగా పాదయాత్ర చేసి కాలనీల సమస్యలను తెలుసుకొని జిహెచ్ఎంసి అధికారులు మరియు సంబంధిత అధికారులతో కలిసి సమస్యలను పరిష్కారం చేస్తున్నమన్నారు. దిల్ కూష్ నగర్ లో ఎన్నో సంవత్సరాలుగా రోడ్లు లేఖ ప్రజలు ఇబ్బంది పడ్డారు.వెంటనే
అధికారులతో కలిసి అక్కడిక్కడే పరిష్కారం,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం అభివృధిలో దేశంలో అగ్రస్థానంలో ఉంది బాలానగర్ డివిజన్ లో అన్ని సమస్యలు పరిష్కారం చేశాం.పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేస్తాం. కేంద్రంతో పోరాడి రోడ్లువేయెంచమని అడిగామన్నారు, కానీ డివిజన్ అభివృద్ధి కొరకై మంత్రి కేటీఆర్ ని కలిసి లో పెండింగ్లో ఉన్న పనులను సమస్యలనుపరిష్కరిస్తామని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు,స్థానిక నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.