బాలాపూర్ లడ్డు @ 27 లక్షలు
హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దయానంద్ తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పాటిగూడ గ్రామంకు చెందిన వ్యక్తి. వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి. నేటితో బాలాపూర్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. అనుకున్నట్టుగానే అందరి ఆసక్తి మేరకు రికార్డు స్థాయిలోనే ధర పలికింది. గతేడాది రూ. 24 లక్షలకు వేలం పాటలో బాలాపూర్ లడ్డు అత్యధిక ధర పలికిన విషయం విదితమే.