బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.

బెల్లంపల్లి, అక్టోబర్ 21, (జనంసాక్షి)
బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని నెన్నెల ఎస్సై రాజశేఖర్ సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాలిక సాధికారత కార్యక్రమంలో భాగంగా చట్టాలపై వివరించారు. వారికి ఏవిధమైన సహాయం కావాలన్న టోల్ ఫ్రీ నెం. 1098 మరియు 100 కు ఫోన్ చేయాలని సూచించారు. బాలిక సాధికారత కార్యక్రమంలో పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో కలిసి పని చేస్తాయని వివరించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ, కస్తూర్బా గాంధీ విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ అమూల్య, తదితరులు పాల్గొన్నారు.