బాలికల విద్య కోసం పాటుపడుతున్న మదర్సాలకు తోడ్పాటు అందించాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): బాలికల విద్య కోసం పాటుపడుతున్న మదర్సాలకు ప్రజలు తమవంతు సహాయ సహకారాలు అందించాలని  తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో జమియా తుర్ రహమాన్ ట్రస్ట్ అబ్దుల్ కాఫీ అస్రార్ వారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్ లోలో భాగంగా బాలికలు తయారు చేసిన వస్తువుల ఎగ్జిబిషన్ ను ఆయన  ప్రారంభించి మాట్లాడారు.సమాజంలో  అట్టడుగు వర్గాల కుటుంబాల నుండి వచ్చిన బాలికలకు ఉచిత విద్యతో పాటు ఉపాధి శిక్షణ అందిస్తున్న మదార్సా సేవలను ప్రశంసించారు.బాలికలు విద్యతో పాటు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అన్ని రకాల వస్తువులను తయారుచేసి తమ కాళ్ళపై వారు నిలదొక్కునే విధంగా చొరవ చూపించడం అభినందనీయం అన్నారు.సంస్కృతి, సంప్రదాయాలు నేర్పిస్తున్న మదర్సాలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు తమ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.సీఎం కెసిఆర్ ప్రభుత్వం ఉర్దూ మీడియం పాఠశాలల ద్వారా ముస్లిం బాల బాలికలకు ఉచిత విద్య  వసతిని కల్పిస్తుందని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో మదర్సాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముక్తి ఉమర్ అభిదున్, ముక్తి నాసిర్ హుస్సేన్, ముఫ్తీ హసీన్ , ముఫ్తీ అబ్దుల్ నాపే ఉస్మా , సోహెల్ మౌలానా జబ్బార్, మౌలానా రఫీ దిన్, మౌలానా అబ్దుల్ వాసే, కౌన్సిలర్  తహేర్ పాషా, కో ఆప్షన్ సభ్యులు రియాజుద్దిన్, ఉర్దూ ఘర్, షాదీఖానా జిల్లా చైర్మన్ కరాటే సయ్యద్ , టిఆర్ఎస్ నాయకులు సుంకరి రమేష్, అబ్దుల్ అజీజ్, గౌస్ ఖాన్, తహేర్, జానీ, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.