బాలికా విద్యతోనే సమాజికాభివృద్ది

5
ప్రధాని  నరేంద్ర మోదీ
శ్రీనగర్‌,ఏప్రిల్‌19(జనంసాక్షి): కూతుళ్లను చదువు వైపు మళ్లిస్తున్న తల్లులందరికీ వందనాలు సమర్పిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బాలికా విద్యాకు ప్రాధాన్యం ఇస్తున్న వారంతా అభినందనీయులన్నారు. బాలికా చదువుతోనే సమాజాంలో మార్పులు వస్తాయని అన్నారు. 24 గంటల క్రితమే ఓ భారతీయ అమ్మాయి రియో ఒలింపిక్స్‌కు ఎంపికైందని, ఆమె సాధించిన ఘనత అపూర్వమని జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ ను మోదీ కీర్తించారు. జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది విజ్ఞాన శతాబ్ధం అని, మానవజాతి విజ్ఞాన యుగంలోకి వెళ్లిన ప్రతిసారి భారత్‌ దానికి మార్గం చూపిందన్నారు. యువత స్వప్నం దేశ వికాసానికి ఉపయోగపడుతుందన్నారు. ఎంతో మంది భక్తులు ఇచ్చిన కానుకలతో వైష్ణోదేవి విశ్వవిద్యాలయం నిర్మించారని, భక్తుల్లో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారున్నట్లు ఆయన తెలిపారు. సాధించలేని దాని గురించి ఆలోచించడం మానేసి, సాధించిన దాని గురించి ఆలోచించాలని మోదీ అన్నారు. తల్లిదండ్రులు విూ భవిష్యత్తు కోసం చేసిన త్యాగాన్ని విూరు గుర్తు చేసుకోవాలని, విూ సంతోషం కోసం వాళ్లు తమ సంతోషాన్ని వదులుకున్నారని మోదీ అన్నారు. ప్రతి ఒక్కరూ అనుకుంటే సాధించలేనిది లేదన్నారు. పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు వరిస్తాయని అన్నారు