బాలుర హాస్టల్లో వైద్య శిబిరం
టేకులపల్లి, జూన్ 30( జనం సాక్షి): టేకులపల్లి లోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర హాస్టల్లో సులానగర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు తగు చికిత్స మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఈ సీజన్లో వచ్చే వ్యాధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గాలి ద్వారా వచ్చే కరోనా, జలుబు, దగ్గు, క్షయ వ్యాధి కంఠసర్పి తట్టు అలాగే కలుషితమైన ఆహారం, కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధులైన వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్ జ్వరం, కామెర్లు, బంక విరోచనాలు, కడుపులో నులిపురుగులు, దోమ కాటు ద్వారా వచ్చే మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, మెదడువాపు ,బోధకాలు తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ ఏ టి పి సురేష్ రెడ్డి,దనసరి రాంబాబు, ఈసం ప్రసన్న ,మజహరి ,ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.