బాల్కొండలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం*

బాల్కొండ జులై 21 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాల్కొండ మండల కేంద్రంలో పాలు మరియు పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పన్ను విధించడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈసందర్భంగా ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్,రైతు బంధు మండల కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్,మండల తెరాస నాయకులు,రైతులు పాత జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది.ఈసందర్భంగా వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పన్ను విధించడాన్ని మరియు నిత్యావసర సరుకుల ధరలు పెంచడంపై పేద,మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఆర్థిక భారం పడుతోందని,పేద ప్రజలపై జి ఎస్టీ పన్ను పెంచడం సిగ్గుచేటని,చరిత్రలో ఎన్నడూ లేని విదంగా సామాన్యుల నడ్డి విరిచేలా గ్యాస్ సిలిండర్,పెట్రోల్,డీజిల్, ధరలు,పెంచారని పెంచిన జిఎస్టీ పన్నులు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా పాల ఉత్పత్తులపై జిఎస్టీ పన్ను వెంటనే తగ్గించాలని గ్యాస్ సిలిండర్,పెట్రోల్,డీజిల్,నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుకున్నాయని ధరలు తగ్గించే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని,ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో  నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్,తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్,కోటగిరి శ్రీకాంత్ చారి,నోముల మోహన్, ఎనుగొందుల శ్రీనివాస్,సర్పంచ్లు,నోముల రవి,మంథని చిన్నయ్య,భూస సునీత-నరహరి,నాగులపల్లి కిషన్,పెంటు లింబాద్రి,గ్రామ రైతు బంధు కో ఆర్డినేటర్ కన్న పోశెట్టి,పన్నాల గంగారెడ్డి,జక్క రాజారెడ్డి,ఒద్ది లింగం,సొసైటీ డైరెక్టర్లు డాక్టర్ ప్రసాద్ గౌడ్,నాగులపల్లి సూరజ్ రెడ్డి,నాగపూర్ మల్లేష్,రైతులు తదితరులు పాల్గొన్నారు
Attachments area