బాల కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు…
బాన్సువాడ, జనంసాక్షి (జూన్ 22):
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా రూపుమాపడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సంతోష్ ఆన్నారు. బుధవారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో సర్పంచ్ వెంకటరమణారావు ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ18 సంవత్సరాల లోపు బాల్యవివాహాలు నిర్మూలించడం,
బాలకార్మిక నిర్మూలన పటిష్ట పరిచే విధంగా కమిటీ నడుచుకోవాలనీ అన్నారు. తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు బాలల పరిరక్షణ విభాగం అండగా ఉంటుందని , 1098 కి ఫోన్ చేసి సమాచారం అందిస్తే అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరమణారావు , ప్రధానోపాధ్యా యుడు నరసింహచారి, అంగన్వాడి టీచర్లు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.