బావిలో పడి యువరైతు మృతి
కురవి (వరంగల్) : వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన యువ రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలం నెరెడ పంచాయతి పరిధిలోని ఎల్కచెట్టు తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
తండాకు చెందిన లాల్ సింగ్(23) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి.. కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.