బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే తండాల అభివృద్ధి .

బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే తండాల అభివృద్ధి 

వనపర్తి బ్యూరో నవంబర్06 (జనంసాక్షి)ఉమ్మడి పాలనలో తండాల అభివృద్ధి కోసం పట్టించుకున్న దాఖలాలు లేవని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండా లను గ్రామ పంచాయితీ లుగా మార్చడంతో అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేసిందని మంత్రి కూతురు డాక్టర్ ప్రతుష గుర్తు చేశారు. సోమవారం ఖిల్లా ఘనపురం మండలం కోతుల కుంట తండా లో స్థానిక నాయకులతో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తండా కు రూ 2కోట్ల 62 లక్షలు బిటి రోడ్లు, రూ 12 లక్షలతో కమ్యూనిటి కామన్ హాల్స్, రూ 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ 5 లక్షలతో బోర్ మోటారు, రూ 43 లక్షలతో సిసి రోడ్, రూ 15 లక్షలతో సిసి డ్రైన్ , 138 ఇండ్ల కు మిషన్ భగీరథ పనులు, సీఎం గిరి వికాస్ కింద 28 మంది లబ్ధిదారులకు రూ 15 లక్షలతో బోర్ల మోటార్ , సంవత్సరం కు ఎస్టీ లకు విద్యుత్ సబ్సి డి కింద రూ 4లక్షల 86 వేలు, వ్యవసాయ పొలాలకు విద్యుత్ సబ్సి డి కింద రూ64లక్షల 64 వేలు ప్రభుత్వం చెల్లిస్తున్నారని ఆమె వివరించారు .ఈ కార్యక్రమంలో కిట్టు, గంగ ప్రసాద్, ప్రేమ్ కుమార్, నవీన్ సాగర్, నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు