బిచ్కుందకు నేడు హరీష్ రావు రాక
బిచ్కుందకు నేడు హరీష్ రావు రాక
బిచ్కుంద అక్టోబరు (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల అభివృద్ధి పనులు ప్రారంభించుటకు నేడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పర్యటన ఉందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పటేల్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ శోభా రాజు, జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే పాల్గొంటారని పేర్కొన్నారు. బిచ్కుంద మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, సహకార సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గం మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసి సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు సకాలంలో పాల్గొని భారీ బైక్ ర్యాలీని మరియు మంత్రి గారి పర్యటనను విజయవంతం చేయగలరని ఎంపీపీ అశోక్ పటేల్, నాల్చర్ రాజు, వెంకట్రావు దేశాయ్ కోరారు