బిజెపిని ఇరుకున పెట్టిన ఆడియో టేపులు

బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసిందని ఆడియో క్లిప్‌ లు వెలువడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి నేతలు, సీఎం యడ్యూరప్ప ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఇప్పటికే మూడు రకాల ఆడియో క్లిప్‌ లను బయటపెట్టారు. ఈ తరుణంలో మాజీ సీఎం సిద్దరామయ్య మోడీపై విమర్శలు గుప్పించారు. అవినీతిపై ప్రధానమంత్రి మోడీ ఉపన్యాసాలు చేస్తారని సిద్దరామయ్య గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ట్విట్టర్‌ వేదికగా ప్రధానమంత్రి మోడీపై విమర్శలు గుప్పించారు. నైతికత ఉంటే కర్ణాటకలోని బిజెపి నేతలకు యడ్యూరప్పకు లంచాలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పనిని మానుకోవాలని బిజెపి నేతలకు సూచించాలని సిద్దరామయ్య మోడీని కోరారు. కర్ణాటకలో సుస్ధిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు పార్టీల కూటమికి అవకాశం కల్పించాలని ఆయన మోడీని కోరారు. కర్ణాటకలో బిజెపికి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీస మెజార్టీకి కనీసం 7
ఎమ్మెల్యేలు అవరం ఉంది. అయితే ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకొనేందుకు గాను బిజెపి నేతలు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆడియో క్లిప్‌ లను కూడ విడుదల చేశారు.
————