బిజెపి ఆధ్వర్యంలో రామాయణ కావ్య సృష్టికర్త వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

వనపర్తి బ్యూరో అక్టోబర్28 (జనంసాక్షి)

బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.నారాయణ అధ్యక్షతన రామాయణ కావ్య సృష్టికర్త వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు డా.రాజ వర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నారాయణ మాట్లాడుతూ తన కుటుంబ పోషణ నిమిత్తం అడవులలో దొంగతనాలు చేసే వ్యక్తిగా జీవితాన్ని ఆరంభించిన బోయి రత్నాకర్ అనే వ్యక్తి రామా అనే రెండు పదాలు కూడా ఉచ్చరించే వాడడం రాని బోయ రత్నాకర్ లో ప్రపంచానికి రామాయణ కావ్య సృష్టికర్త కాగల మహోన్నత్వాన్ని గుర్తించి తన మంత్రోపదేశం ద్వారా వాల్మీకి మహర్షిగా మార్చిన ఘనత నారదాం మునీశ్వరుడికి దక్కుతుందని పేర్కొన్నారు.కుటుంబాల్లో ఒక తండ్రికి కొడుకు, ఒక తమ్ముడికి అన్న, ఒక భార్యకు భర్త, ఒక తల్లికి కొడుకు రాముడి లాంటి వ్యక్తి ఉండాలని ప్రపంచ మానవాళి కోరుతుందని అలాంటి అత్యుత్తమ కుటుంబం బంధాలకు ప్రేరణగా నిలిచిన రామాయణ కావ్య సృష్టికర్త మహర్షి వాల్మీకి కవులలో ఆదికవిగా కీర్తింపబడతారని రామాయణ కావ్యాన్ని ఏడు ఖండాలు, 24 వేల శ్లోకాలతో లిఖించడం జరిగిందని గాయత్రి మంత్రంలో జపించే 24 శ్లోకాలకు ప్రేరణ రామాయణ కావ్యం లోని 24 వేల శ్లోకాలని వాల్మీకి రామాయణం ప్రపంచంలోని అత్యధిక దేశాలలో వారి భాషలలోకి అనువదించుకొని శ్రీరామునికి ఆరాధ్యంగా కొలుచున్నారని దీనికి ఆద్యం వాల్మీకి మహర్షి అని కొనియాడారు.
భారతదేశంలో 500 ఏళ్లుగా పరిష్కరించబడిన సమస్యగా ఉన్న శ్రీరాముడు పుట్టిన అయోధ్యలోని రామాలయాన్ని యుగపురుషుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సమస్య పరిష్కరించబడి అయోధ్యలో దివ్యమైన భవ్యమైన ప్రపంచ మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి రామాలయం నిర్మాణం పూర్తికావచ్చిందని 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయాన్ని ప్రపంచానికి అంకితం చేయబోతున్నారని రామాలయ ప్రారంభోత్సవం వాల్మీకి మహర్షికి నిజమైన నివాళి అని 2024 లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో మరొక్కమారు రామరాజ్య పాలన పునరావృతం అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ విస్తారక్ కేతూరి బుడ్డన్న, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ. సీతారాములు,రామన్న గారి వెంకటేశ్వర్ రెడ్డి, సుమిత్రమ్మ,చిత్తారి ప్రభాకర్ పార్లమెంట్ కో కన్వీనర్ జింకలకృష్ణయ్య కోశాధికారి బాసెట్టి శ్రీనివాసులు యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అనుజ్ఞ రెడ్డి బిజెపి అధికార ప్రతినిధి పెద్దిరాజు పట్టణ అధ్యక్షులు బచ్చు రాము ప్రధాన కార్యదర్శులు రాయన్న సాగర్ నందిమూల రవి జిల్లా కార్యవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి రఘు యాదవ్ ఓబీసీ మోర్చాజిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ ఓ బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నరేంద్ర భూపతి ఓం ప్రసాద్ చారి బిజెపి మండల అధ్యక్షులు భగవంతు యాదవ్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాం రెడ్డి జ్ఞానేశ్వర్ దాశరాజు ప్రవీణ్ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు తిరుమలేష్ వివిధ మోర్చాలకుచెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు