బిజెపి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి

ధర్మపురి (జనం సాక్షి న్యూస్)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,రాష్ట్ర దళిత మోర్చ కొప్పు భాష,దళిత మోర్చా జిల్లా అలాగుర్తి లక్ష్మినారాయణ, వీరి సూచన మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్ అధ్వర్యంలో
బస్తీ సంపర్క్ అభియాన్ లో బాగంగా శుక్రవారం ఉదయం ధర్మపురి పట్టణం మరియు గ్రామంలోని,తుమ్మెనాల దళిత బస్తీల లో ఇంటింటా కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్, మాట్లాడుతూ మెట్రిక్ స్కాలర్ షిప్ పధకం
క్రింద 10వ, తరగతి వరకు చదివే మరియు సంవత్సరానికి ₹ లక్ష లోపు ఆధాయము కల కుటుంబానికి చెందిన విద్యార్ధికి ప్రీ -మెట్రిక్ స్కాలర్ షిప్ అందించడం జరుగుతుంది అని, ఇందులో 30% సీట్లు బాలికలకు కేటాయించడం జరుగుతుంది అని,ఈ పధకం క్రింద ₹ కోట్ల ఖర్చు చేయడం జరిగిందన్నారు.
కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా నాయకులు బస్తీ సంపర్క్ అభియాన్ కొ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి,దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం రమేష్,దళిత మొర్చ జిల్లా అధికార ప్రతినిధి బరిగల భూమయ్య, తుమ్మెనాల ఎంపీటీసీ ఆకుబత్తిని తిరుపతి,బిజెపి దళిత మోర్చా మండల అధ్యక్షుడు కడారి గంగాధర్,మండల పట్టణ అధ్యక్షుడు సంగేపు గంగారాం, బేజ్జారపు లవన్ కుమార్, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బండారి లక్ష్మణ్,మండల కోశాధికారి దుర్గం సుధాకర్, ముడుసుల రాజేందర్,నారావెని మూర్తి, అయ్యోరి సత్యం తదితరులు పాల్గొన్నారు.