*బిజెపి సంతకాల సేకరణ ఉద్యమం*
కొడకండ్ల, జులై (జనం సాక్షి):
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు పనస రాములు ఆధ్వర్యంలో కొడకండ్ల మండల కేంద్రంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు కుంభం అశోక్ రెడ్డి జిల్లా కార్యదర్శి మోడపల్లి సోమన్నతో కలిసి మాట్లాడుతూ 2018 ఎన్నికలలో మ్యానిఫెస్టోలో తిరిగి అధికారంలోకి రాగానే లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను ఏక మొత్తంగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని, నాలుగు సంవత్సరాల కాలం పూర్తి కావస్తున్న హామీ నేటికీ అమలు కాకపోవడం వల్ల బ్యాంకులలో అసలు వడ్డీతో సహా పెరిగిపోయి బ్యాంకులలో పరపతి కోల్పోతున్న రైతులు వ్యవసాయ అవసరాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి ఆర్థిక వడ్డీ రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని, దఫాల వారిగా రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదని, లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను వడ్డీతో సహా వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టితో రైతు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలోని ప్రభుత్వం అమలు చేయని కారణంగా రైతులు త్రీవంగా నష్టపోతున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పులిగిల్ల ఉపేందర్, మండల సీనియర్ నాయకులు దండంపల్లి సోమన్న, నర్సింగాపురం బూత్ అధ్యక్షులు కప్పల నాగయ్య ,బూత్ ప్రధాన కార్యదర్శి బురుగు శీను తదితరులు పాల్గొన్నారు.