బిజెవైయం ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టి బొమ్మ దగ్దం.

సోనియా గాంధీ,అధిక్ రంజన్ చౌదరి జాతికి క్షమాపణలు చెప్పాలి.
బిజెవైయం జిల్లా అధ్యక్షులు మూలే భారత్ చంద్ర.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై28(జనంసాక్షి):
కాంగ్రెస్ పార్టీ కి చెందిన లోక్ సభ ఫ్లోర్ లీడర్ అధిక్ రంజన్ చౌదరి గిరిజన బిడ్డ, భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని గురువారం బీజేవైయం ఆధ్వర్యంలో కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన తెలిపి సోనియా గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా బిజెవైయం జిల్లా అధ్యక్షులు మూలే భరత్ చంద్ర మాట్లాడుతూ ఒక గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయితే కూడా సహించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు సిగ్గుపడాలని అభిప్రాయపడ్డారు.దేశ అత్యున్నత స్థానానికి ఒక గిరిజన బిడ్డ ఎంపికవడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రేస్ పార్టీకి దళితులన్నా,ఆదివాసీల న్నా, మహిళలన్నా ఏమాత్రం గౌరవం లేదన్నారు.దేశ రాష్ట్రపతిని ఈ విధంగా కించపరిచిన పరిస్థితిని భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారని, ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం జీర్ణించుకోలేక ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసూయతోనే టీఆర్ఎస్ తో సహా అన్ని పార్టీలతో చేతులు కలిపి ఓడించడానికి ప్రయత్నం చేసిందని అన్నారు.ముర్ము రాష్ట్రపతికి గా గెలిచిన తర్వాత కూడా సోనియాగాంధీ తమ పార్టీ ఎంపీలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తూ గిరిజన రాష్ట్రపతిని అవమానిస్తున్నదని మండిపడ్డారు.వెంటనే ఆ పార్టీ అధ్యక్షురాలు మరియు ఎంపీ అధిక్ రంజన్ చౌదరి జాతికి క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో:బీజేవైయం అసెంబ్లీ కన్వీనర్ పరుశురాం,ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కడ్తాల కృష్ణ,ప్రధాన కార్యదర్శులు ఇమ్రాన్, ఎల్లయ్య,కాశీపురం మహేష్,బడా చందూ యాదవ్,రమేష్ నాయక్,నాగరాజు, భాను, మూలే మహేష్,వంశీ,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.