బిటి రోడ్డు మంజూరై. రెండేళ్లు అవుతున్న పట్టించుకొని

అధికారులు
తొందరగా  రోడ్డు నిర్మాణం చేయ్యాలి
ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్
ఎల్లారెడ్డి 21సెప్టెంబర్ జనం సాక్షి  ఎల్లారెడ్డి మండలంలోని          శివనగర్ గేట్ నుండి రుద్రారం గ్రామం వరకు రోడ్డు మీద గుంతలు ఏర్పడడంతో బుదవారం ఆటో డ్రైవర్లు  కలిసి గుంతల్లో మోరం పోసి గుంతలు పుడ్చు తుండగా ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి బాల్ రాజ్ గౌడ్  అటు వైపు నుండి వెళ్తూ  ఆటో   డ్రైవర్లు  ను చూసిన ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్  మాట్లాడారు            స్వాచ్చింద్ర సేవ చేస్తున్నందుకు ఆటో డ్రైవర్లను అభినందించారు. శివ నగర్  నుండి  రుద్రారo వరకు బిటి రోడ్డు  రెండేళ్ల కిందటే మంజూరు       ఐనదని  టెండర్లు కూడా చేశారని  గుత్తేదార్ల నిర్వాకం తో  ఇలా ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు కూడా పట్టించుకోకపోవడం దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు    ఆమె  మాట్లాడుతూ నిత్యం రుద్రారం  ప్రరిసర ప్రాంతాల నుండి వందలాదిగా ఆటోలలో బైక్ ల పై వస్తుంటారని ఎన్నో మార్లు ప్రమాదాలు జరిగాయని కొంత మంది గాయాల తో బతికిబయట పడ్డారని అన్నారు  ప్రజలు ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్తున్నారని అన్నారు  ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయిన అధికారుల అలసత్వంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్డు నిర్మాణానికి నోచుకోవడం లేదని సంబంధిత అధికారులనిర్లక్ష్యం వల్ల రోడ్డు గుంతల మయంగా అయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డు దుస్సుతి  చూస్తేనే అర్ధం అవుతుంది అని అన్నారు సామాన్యులు  ఈ రోడ్డు గుండా ఆటో లోనే ప్రయనించలంటే జంకుతున్నారు గ్రామాల ప్రజలు తప్పని పరిస్తితి లో రోడ్డుపై నిత్యవసర సరుకుల కొరకు ఎల్లారెడ్డి మండలానికి అదే విధంగా పాఠశాల విద్యార్థులు ఆటోలలో ద్విచక్ర వాహనదారులు కూడా ప్రయాణిస్తూ  రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు  తొందరగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆమె అన్నారు
Attachments area