బిడ్డకు జన్మనిచ్చిన 2 గంటలకే.. పరీక్ష కేంద్రానికి వెళ్లిన తల్లి

wx6612j2
జైపూర్: ఎక్కడ బలమైన కోరిక ఉంటుందో.. అక్కడ అవకాశం కూడా ఉంటుందని అంజుమీనా అనే ఓ మహిళ నిరూపించింది. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. అయితే తన పరీక్షలు జరుగుతున్న సమయానికే ఆమె పురిటి నొప్పులతో బాధపడుతోంది. కాగా, ఓ పాపకు జన్మనిచ్చిన అంజుమీనా.. కేవలం రెండు తర్వాత తన పరీక్షలకు హాజరుకావాలని నిర్ణయించుకుంది. అంతే, ఆలస్యం చేయకుండా జైపూర్‌లోని విద్యాసాగర్ మహిళా మహావిద్యాలయంలో జరుగుతున్న పరీక్షకు హాజరైంది. బిడ్డకు జన్మనిచ్చిన 2 గంటలకే.. పరీక్ష కేంద్రానికి వెళ్లిన తల రాజస్థాన్ పత్రిక కథనం ప్రకారం.. బిఏ చదువుతున్న అంజు తన ఇంటి నుంచి ఉదయం 7గంటలకు హిస్టరీ పరీక్ష రాసేందుకు బయల్దేరింది. అంతకుముందు జైపూర్‌లోని సంగనేరి ఆస్పత్రిలో ఉదయం 5గంటలకు ఆమె ఓ పాపకు జన్మనచ్చింది. పరీక్ష రాసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఇప్పుడు పరీక్ష రాయకపోతే ఏడాది మొత్తం వృథా అయ్యేదని చెప్పింది. కాగా, కళాశాల అధికారులు కూడా ఆమె పరీక్ష రాసేందుకు తగిన ఏర్పాటు చేసి సహకరించారు.