బినాయక్‌సేన్‌కు గాంధీ పురస్కారం
లండన్ : భారత సంతతికి చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్ సేన్, బులు ఇమామ్‌లకు లండన్‌లో ని గాంధీ ఫౌండేషన్ అంత ర్జాతీయ శాంతి పురస్కారా లను ప్రకటించింది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను బోధిస్తూ, అహింసను పాటిం చే వారికి ఈ పురస్కారాలు బహూకరిస్తారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో వీరికి అవార్డులు ప్రదానం చేస్తారు. బెంగాల్‌కు చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ బినాయక్ సేన్ ప్రజారోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గిరిజనుల ఆరోగ్యం కోసం విశేషంగా కృషి చేశారు. అదే సమయంలో మానవహక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను తీవ్రంగా ప్రతిఘటించారు’ అని గాంధీ ఫౌండేషన్ సేన్ గురించి పేర్కొంది. సేన్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ జాతీయ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. సేన్ లండన్‌కు వెళ్లేందుకు వీలుగా ఛత్తీస్‌గఢ్ కోర్టు స్వాధీనం చేసుకున్న ఆయన పాస్‌పోర్టును తిరిగి ఇచ్చేసినట్టు సమాచారం. కాేగా. ఇమామ్ గత రెండు శతాబ్దాల కాలంలో ఎందరో మేధావులనందించిన కుటుంబం నుంచి ఇమామ్ వచ్చారని పేర్కొంది. ఇమామ్ 1987 నుంచి ఐఎస్‌టీఏసీహెచ్ హజారీ చాప్టర్ చాప్టర్‌కు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.