బియ్యం కూపన్‌ల పంపిణీ
కాప్రా : ఇటీవల రచ్చబండ కార్యక్రమంలో మంజూరైన రేషన్‌కార్డుల లబ్దీదారులకు ఉప్పల్ పౌరసరఫరా శాఖ అధికారులు బియ్యం కూపన్‌లు పంపిణీ చేశారు. బుధవారం పాత మున్సిపాల్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 16వ తేదీ వరకు పాత మున్సిపల్ కార్యాలయంలో కుషాయిగూడ, చర్లపల్లి, హెచ్‌బీ కాలనీల్లోని వార్డు కార్యాలయాల్లో బియ్యం కూపన్‌లను పంపిణీ చేస్తామని పౌరసరఫరా శాఖ ఇన్స్‌పెక్టర్ పి. రాములు తెలిపారు.